Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

త్వరలో చిన్నారులకు కొవిడ్‌ టీకా

చిన్నారులకు జైడస్‌ క్యా డిలా రూపొందించిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. అందరికీ అందుబాటులో ఉండే ధరను అందించాలని సూచించింది.ఇందుకు సంబంధించిన చర్చలు సపలమైనట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సిఉంది. కాగా, చిన్నారులకు సూది అవసరం లేకుండా విడ్‌ టీకా జైకోవ్‌-డీను అందించవచ్చని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే దేశంలో కేవలం 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. చిన్నారులకు టీకా వేయడం లేదు. త్వరలో వారికీ టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.కొవిడ్‌ టీకా జైకోవ్‌-డీను జైడస్‌ క్యా డిలా రూపొందించింది. ఈ టీకాకు సంబంధించి తొలుత రూ.1,900కు టీకాను అందజేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై ప్రభుత్వం చర్చలు జరిపింది. మార్కెట్లో ఉన్న టీకాల ధరలు అవసరాలను పరిశీలించింది. చివరగా ఒక డోసు రూ.265కు అందించాలని సంస్థకు సూచించింది. ఇందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా తక్కువ ధరకే చిన్నారులకు కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img