Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దాణా కుంభకోణం కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష

దాణా కుంభకోణంలో చిట్టచివరిది, ఐదవది అయిన డొరండా ఖజానా కేసులో ఆర్జేడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో పాటు లాలూకు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. లాలూతోపాటు మరో 99 మంది నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని న్యాయస్థానం జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. గత మంగళవారం లాలూను దోషిగా తేల్చింది. మరో 46 మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 24 మందిని నిర్దోషులుగా పేర్కొంది. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని అభియోగాలు నమోదయ్యాయి. ఇది దాణా కుంభకోణంలో ఐదో కేసు మాత్రమే కాకుండా, అతిపెద్ద కేసు కూడా ఇదే. ఈ కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.పశుగ్రాసం కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా నిలిచారు.. అయితే ఇది తుది తీర్పు కాదని , సీబీఐ కోర్టు తీర్పును లాలూ ప్రసాద్‌ యాదవ్‌ హైకోర్టులో , అవసరమైతే సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని ఆర్జేడీ నేతలు తెలిపారు.అబే చైబాసా ట్రెజరీ నుండి 37.7 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నందుకు సంబంధించిన మొదటి కేసులో లాలూ ప్రసాద్‌కు 5 సంవత్సరాల శిక్ష పడిరది. దేవఘర్‌ ట్రెజరీ నుంచి నిధుల ఉపసంహరణ కేసులో మూడున్నరేళ్లు శిక్ష, చైబాసా ట్రెజరీ నుండి 33.13 కోట్లు అక్రమంగా ఉపసంహరించుకున్న మూడవ కేసులో 5 సంవత్సరాల శిక్ష పడిరది. దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై నాలుగో కేసులో రెండు వేర్వేరు సెక్షన్లలో ఏడేళ్ల జైలు శిక్ష పడిరది. ఇప్పుడు ఐదో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img