Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దానిపై రాష్ట్ర ప్రభుత్వాలనే నిలదీయాలి

నిర్మలా సీతారామన్‌
పెట్రో ధరల భారం తగ్గాలంటే ఓటు వేసి గెలిపించుకున్న రాష్ట్ర ప్రభుత్వాలనే నిలదీయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కోరిందని, అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం అందుకు సముఖంగా లేవని చెప్పారు. ఆ రాష్ట్రాలను ఓటు వేసి గెలిపించుకున్న ప్రజలే నిలదీయాలన్నారు. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5లు, డీజిల్‌పై రూ.10లు ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. అన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని కోరింది. అయితే కొన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనలు తోసిపుచ్చాయి. గతంలో పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా ఎక్సైజ్‌ డ్యూటీని పెంచిన కేంద్రం.. ఇప్పుడు చాలా తక్కువగా మాత్రమే దీన్ని తగ్గించిందని ఆ రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img