Friday, April 19, 2024
Friday, April 19, 2024

దిల్లీలో వాయుకాలుష్యంపై కేజ్రీవాల్‌ అత్యవసర సమావేశం

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం తీవ్రతపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ) సలహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌, పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌తో చీఫ్‌ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరు కానున్నారు.ఢల్లీి-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. రెండ్రోజులు లాక్‌డౌన్‌ విధిస్తారా, ఇంకేమైనా చేస్తారా, ప్రజలు ఎలా బతకాలి? అని నిలదీసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ శీతాకాలం వేళ దిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితులపై కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దాని విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img