Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బయటపడిన చారిత్రక సొరంగం


దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్య్ర సంగ్రామ కాలంనాటి చారిత్రక సొరంగం బయటపడిరది. దిల్లీ అసెంబ్లీ వద్ద ఆ సొరంగాన్ని గుర్తించారు. ఇది ఎర్ర కోట వరకు ఉన్నట్లు చెప్తున్నారు.స్వాతంత్య్ర సమరయోధులను తరలించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటీషర్లు వాడినట్లు తెలుస్తోంది. దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, బ్రిటిష్‌ పరిపాలకులు ఈ సొరంగాన్ని ఉపయోగించేవారని చెప్పారు. తాను 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనపుడు తాను ఈ సొరంగం గురించి వినేవాడినని చెప్పారు. ఈ సొరంగం శాసన సభ నుంచి ఎర్ర కోట వరకు ఉన్నట్లు చెప్పేవారని, తాను దీని చరిత్రను తెలుసుకోవడం కోసం ప్రయత్నించానని, అయితే స్పష్టత రాలేదని చెప్పారు. ఈ సొరంగం ప్రారంభ స్థానం కనిపించిందని, మిగిలిన సొరంగాన్ని గుర్తించేందుకు తవ్వకాలు జరపబోమని చెప్పారు. ఎందుకంటే ఈ సొరంగ మార్గంలో మెట్రో పిల్లర్లు, మురుగు కాలువల నిర్మాణాలు ఉంటాయన్నారు. స్వాతంత్య్ర సమర యోధులను న్యాయస్థానానికి తీసుకెళ్ళడానికి ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారని చెప్పారు. ఇక్కడ ఉరి కంబం గది ఉన్నట్లు అందరికీ తెలుసునని చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా తాను ఆ గదిని పరిశీలించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనిని స్వాతంత్య్ర సమర యోధుల పవిత్ర స్థలంగా మార్చి, నివాళులర్పించాలనుకుంటున్నామని తెలిపారు. పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించి, మన చరిత్రను తెలుసుకునేలా చేయాలనుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img