Friday, April 19, 2024
Friday, April 19, 2024

దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఇంట్లో ఈడీ సోదాలు

హవాలా కేసులో అరెస్టయిన దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే నేడు జైన్‌కు చెందిన నివాసం, ఇతర కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గతనెల 30న మనీలాండరింగ్‌ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం సోమవారం తెల్లవారుజాము నుంచి ఢల్లీిలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. కోల్‌ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్‌ అక్రమంగా డబ్బులు ట్రాన్స్‌ ఫర్‌ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్‌, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన 4.81కోట్ల విలువైన స్థిరాస్థులను ఈడీ గత ఏప్రిల్‌లోనే జప్తు చేసింది. సత్యేంద్రజైన్‌ పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. జూన్‌ 9 వరకు సత్యేంద్ర ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img