Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దిల్లీ మద్యం కేసులో వైసీపీ మరో ఎంపీ తనయుడి అరెస్ట్‌

. లంచ్‌ బాక్సులు పట్టించిన సీపీఐ శ్రేణులు
. నాగార్జున మోడల్‌ స్కూల్‌ వద్ద బైఠాయించి ఆందోళన
. ఎట్టకేలకు గదిని సీజ్‌ చేసిన పోలీసులు
. ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌

10 రోజుల ఈడీ కస్టడీకి మాగుంట రాఘవ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో వైసీపీ ఎంపీ తనయుడు అరెస్టయ్యాడు. గతంలో ఇదే కేసులో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అల్లుడు శరత్‌చంద్రా రెడ్డి అరెస్టయిన విషయం విదితమే. తాజాగా మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని 10 రోజుల ఈడీ కస్టడీకి రౌస్‌ అవెన్యూ కోర్టు శనివారం అనుమతిచ్చింది. సౌత్‌ గ్రూపు తరపున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర కీలమని, ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడితో పాటు ఈ కేసులో ఉన్న ఇతర నిందితులతో సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ వాదనలు బలంగా వినిపించింది. కేసు దర్యాప్తు ప్రస్తుతం పురోగతిలో ఉందని, తదుపరి విచారణ కోసం ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ చట్టం కింద నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించవచ్చని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. రాఘవకు మద్యం తయారీ కేంద్రాలతో పాటు హోల్‌సేల్‌ వ్యాపారం, రెండు రిటైల్‌ జోన్‌లు కూడా ఉన్నాయని ఈడీ కోర్టుకి వివరించింది. ఇండో స్పిరిట్‌ కంపెనీలో రాఘవకూ భాగస్వామ్యం ఉందని, దీనినుంచి క్రమం తప్ప కుండా ఆయన వాటా వెళుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కుంభ కోణంలో ఆయన పాత్రకు సంబంధించి ఇప్పటికే దాదాపు 30 మంది సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని వివరించింది. ఇంకా రూ.30 కోట్లకు సంబంధించి వివరాలు రాబట్టాల్సి ఉందని, అలాగే ఈ కేసులో రాఘవ నుంచి ఇంకా రాబట్టాల్సిన వివరాలు, ఆధారాలు చాలా ఉన్నాయని, అందువల్ల కస్టడీకీ అప్పగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈడీ కస్టడీని రాఘవ తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. ఈడీ ఏర్పడిన ప్రత్యేక చట్టం ప్రకారం అరెస్ట్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈడీలో పోలీస్‌ కస్టడీ లేకపోవడంతో సీఆర్పీ చట్టం అమలవుతుందని, కస్టమ్స్‌ చట్టం ప్రకారం అరెస్ట్‌ చేసే అధికారం ఉన్నా, ఇక్కడ ఆ సెక్షన్లు లేవని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో మెజిస్ట్రేట్‌ తన కస్టడీకి తీసుకోవచ్చునని, లేనిపక్షంలో జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని రాఘవ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నరేష్‌ కుమార్‌ లాకా.. మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చారు. అలాగే రాఘవరెడ్డిని ప్రతిరోజూ గంటపాటు కలిసేందుకు కుటుంబ సభ్యులకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. ఇంటి నుంచి భోజనం తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21కి కోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img