Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. హైదరాబాద్‌ సహా 30 చోట్ల ఈడీ సోదాలు

దిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌, లఖ్‌నవూ తదితర నగరాల్లో తనిఖీల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ విషయానికి వస్తే ప్రేమ్‌ సాగర్‌, అభిషేక్‌ రావు, సృజన్‌ రెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అయితే, సోదాలు జరుపుతున్న విషయాన్ని ఈడీ ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. ఇదే కేసుకు సంబంధించి ఢల్లీి డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అధికార నివాసంలో సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. మరోవైపు, లిక్కర్‌ స్కామ్‌ పేరుతో బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆప్‌ మండిపడుతోంది. కేంద్ర వ్యవస్థలను ఉపయోగించుకుంటూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిందని… బీజేపీలోకి వస్తే ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేసిందని అన్నారు. ఇంకోవైపు, తమ ఎక్సైజ్‌ పాలసీపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో… పాలసీని ఆప్‌ ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img