Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ కలకలం..గుజరాత్‌లో తొలి కేసు నమోదు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. అయితే కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంంబైలో ఈ రకం కేసులు బయటపడినట్లు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోనూ తొలి ఒమిక్రాన్‌ ‘ఎక్స్‌ఈ’ కేసు శనివారం వెలుగుచూసింది.గుజరాత్‌ రాష్ట్రంలో కరోనావైరస్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ ఒక కేసు కనుగొన్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గుజరాత్‌ రోగికి మార్చి 13వతేదీన కొవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలిందని, అతను వారం రోజుల్లో కోలుకున్నాడని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అధికారులు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తికి జీనోమ్‌-సీక్వెన్సింగ్‌ తర్వాత ఎక్స్‌ఈ వేరియంట్‌ కరోనావైరస్‌ సోకినట్లు గుర్తించారు. రోగికి ఎక్స్‌ఈ వేరియంట్‌ అని నిర్ధారించడానికి నమూనాను మళ్లీ పరిశీలించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఓమైక్రాన్‌ బీఏ.2 సబ్‌-వేరియంట్‌ కొవిడ్‌-19 అంటువ్యాధిగా పరిగణిస్తున్నారు. ముంబై ఎక్స్‌ఈ కేసు పునర్విచారణ ఇంకా పూర్తి కాలేదు.ముంబై రోగి శాంపిల్‌ను పరీక్ష కోసం పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img