Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కరోనా ఉగ్రరూపం

కొత్తగా 2,64,202 కరోనా కేసులు
్యదేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 2,64,202 కొత్తగా కోవిడ్‌ కేసులు నమోదు అవగా… 315 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 1,09,345 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.. నిన్నటి కేసుల కంటే ఈరోజు 6.7 శాతం అధికంగా కోవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 12,72,073 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,85,350గా ఉంది. రోజువారీ కొవిడ్‌ పాజిటివ్‌ రేటు 14.78 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో మహమ్మారి విజృంభణకు దోహదం చేస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు 5,753కి పెరిగాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌, దిల్లీ, కేరళలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 73 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు దేశంలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ 70 శాతం పూర్తయిందని నిన్న ప్రధాని తెలిపారు. మొత్తంగా 155 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 15`18 మధ్య వయస్సు వారికి 3.14 కోట్ల డోసులు అందాయి. 33,63,635 మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img