Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కరోనా కొత్త కేసులు 1.79 లక్షలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,79,723 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో 12.6 శాతం పెరుగుదల కన్పించింది. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 13.29 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వల్ల ఒక్కరోజు వ్యవధిలో మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగువేలు దాటింది. ఇప్పటివరకు మొత్తంగా 4.033 మంది కొత్త వేరియంట్‌ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అత్యధికంగా 1,216 ఒమిక్రాన్‌ కేసులు రాగా రాజస్థాన్‌లో 529, దిల్లీలో 513, కర్ణాటకలో 441 కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,552 మంది ఒమిక్రాన్‌ బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం 29.60 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 151.94 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img