Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కరోనా విలయతాండవం..మూడు లక్షలకు పైగా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతోంది. కొత్త కేసులు భారీగా పెరిగి మూడు లక్షల మార్కును దాటేశాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 3,17,532 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అవగా… 491 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు ప్రస్తుతం 16.41 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశంలో 19,24,051 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 2,23,990 మంది బాధితులు కోలుకున్నారు. మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సైతం అలజడి సృష్టిస్తోంది. భారత్‌లో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 9,287కు చేరింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,59,67,55,879 మందికి టీకాలు వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 73,38,592 టీకా డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img