Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 1,685 మందికి పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉంది. కొద్ది రోజులుగా రెండు వేలకు దిగువనే నమోదైన కేసులు నేడూ అదే విధంగా వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 6.9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,685 మందికి వైరస్‌ నిర్ధరణ అయ్యింది. అయితే మరణాలు కొద్దిగా పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.కరోనా కారణంగా 83 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం బాధితులు 4,30,16,372కు చేరారని, ఇందులో 4,24,78,087 మంది కోలుకున్నారని చెప్పింది. మరో 21,530 మంది చికిత్స పొందుతున్నారని, 5,16,755 మంది మహమ్మారి వల్ల మరణించారని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, 98.75 శాతం మంది కోలుకున్నారని తెలిపింది. మరణాల రేటు 1.20 శాతమని పేర్కొన్నది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతంగా ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా 1,82,55,75,126 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఇందులో 29,82,451 వ్యాక్సిన్‌ డోసులను నిన్న ఒకేరోజు ఇచ్చామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img