Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 1,938 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కట్టడిలోనే ఉంది. కొద్డిరోజులుగా రెండువేలకు దిగువనే నమోదవుతోన్న కొత్తకేసుల్లో రెండురోజులుగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం 1700 కేసులు నమోదవగా, తాజాగా అవి 19 వందలకు పెరిగాయి. దీంతో వరుసగా మూడోరోజూ కరోనా బారినపడుతున్న వారిసంఖ్య పెరిగింది. దేశంలో కొత్తగా 1938 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,14,687కు చేరాయి. దేశంలో కొత్తగా 1938 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,14,687కు చేరాయి. ఇందులో 4,24,75,588 మంది కోలుకోగా, 5,16,672 మంది బాధితులు మరణించారు. మరో 22,427 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 67 మంది కరోనాకు బలవగా, 2531 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.05 శాతం మాత్రమేనని, రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 182.23 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img