Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

దేశంలో కొత్తగా 24,354 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 24,354 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 234 మంది మరణించారు. కాగా.. కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 13,834 కేసులు నమోదు కాగా.. 95 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.ప్రస్తుతం దేశంలో 2,73,889 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,91,061 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,48,573 కి పెరిగింది.నిన్న కరోనా నుంచి 25,445 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,30,68,599 కి పెరిగింది. మరో వైపు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోంది.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89,74కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నిన్న ఒక రోజే కొత్తగా 14,29,258 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ చెప్పింది. ఇప్పటి వరకు 57,19,94,990 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img