Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దేశంలో కొత్తగా 29,689 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,20,100 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 29,689 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 132 రోజుల తర్వాత 30వేలకు దిగువన కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో మొత్తం దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,98,100కి చేరింది. ఇందులో 3,06,21,469 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా 42,363 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు. దీంతో రికవరీల సంఖ్య 3,06,21,469కి చేరింది. కరోనాతో 415 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,21,382 చేరుకుంది. కాగా 44,19,12,395 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరిందని.. అలాగే రికవరీ రేటు 97.35 శాతంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img