Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 3,545 కరోనా కేసులు..మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, 3549 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 79.82 కేసులు ఉన్నాయని, ఇందులో దిల్లీలో 1365 కేసులు (38.5 శాతం) నమోదవగా, హర్యానాలో 534, ఉత్తరప్రదేశ్‌లో 356, కేరళ 342, మహారాష్ట్రలో 233 కేసులు నమోదయ్యాయని వెల్లడిరచింది. దాదాపు 40 రోజుల తర్వాత మహారాష్ట్రలో 200కు పైగా కొత్త కేసులు రావడం గమనార్హం. ఇప్పటివరకూ 4.30 కోట్లకుపైగా మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటివరకు 1,89,81,52,695 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో 16,59,843 మందికి గురువారం వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది. అదేవిధంగా నిన్న ఒక్కరోజే 4,23,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img