Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 5,554 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 3.76 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 5,554 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది.దీంతో మొత్తం కేసులు 4,44,90,283కు చేరాయి. ఇందులో 4,39,13,294 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,139 మంది మృతిచెందారు. మరో 48,850 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 6322 మంది వైరస్‌ నుంచి బయటపడగా, 16 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.47 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 98.70 శాతం మంది కోలుకున్నారని, 1.19 శాతం మంది చనిపోయారని ప్రకటించింది. ఇప్పటివరకు 214.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులన పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img