Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 6,563 కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నా..కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి చెందడం కలవరపెడుతోంది. దేశంలోఈ వేరియంట్‌ బాధితుల సంఖ్య 150కి చేరింది. దీనికి సంబంధించిన కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 54 నమోదైనట్లు కేంద్రం వెల్లడిరచింది. ఇక ఆదివారం 7 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు అవి 6 వేలకు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,563 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 132 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి మరో 8,077 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 82,267 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, దేశంలో కరోనా రికవరీ రేటు 98.39 శాతం ఉన్నదని, మరణాల రేటు 1.37 శాతం, యాక్టివ్‌ కేసులు 0.24 శాతం ఉన్నాయని తెలిపింది. ఆదివారం రాత్రివరకు దేశవ్యాప్తంగా 1,37,67,20,359 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో నిన్న ఒకేరోజు 15,82,079 మంది టీకాలు తీసుకున్నారని ఆరోగ్యవాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img