Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 7,350 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు పదివేలకు దిగువనే నమోదవుతున్నాయి. కొత్త కేసులు గత ఏడాది మే నాటి స్థాయికి తగ్గాయి. క్రియాశీల, రికవరీ రేట్లు గతేడాది మార్చినాటి స్థాయికి చేరి ఊరటనిస్తున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. దేశంలో కొత్తగా 7,350 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,97,860కి చేరింది. ఇందులో 4,75,636 మంది మరణించగా, 3,41,30,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 91,456 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 202 మంది మృతిచెందగా, 7973 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. యాక్టివ్‌ కేసులు 561 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.26 శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.37 శాతం ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,33,17,84,462 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది. కాగా మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాప కింద నీరులా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img