Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో తగ్గిన రోజూవారీ కొవిడ్‌ కేసులు..

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజూవారీ పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగాయి. అయితే, గతంతో పోలిస్తే తాజాగా కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గత ఐదు రోజులు వరుసగా 10 వేలకు పైనే కొత్త కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య తాజాగా 7వేలకు పడిపోయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకరాం..ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 78,342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,178 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 65,683 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,4,30,1,865 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,345కి ఎగబాకింది.మరోవైపు కొవిడ్‌ కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 (శదీదీ.1.16) వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు తెలిపారు. అయితే, కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఈ వేరియంట్‌ మరీ అంత శక్తిమంతమైనది ఏమీ కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.15 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img