Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,270 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 325 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో 2,53,739 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 7,780 కేసులు నమోదైన మొదటి ఐదు రాష్ట్రాలు, 2,068 కేసులతో మహారాష్ట్ర ఉండగా, కేరళలో 1,333 కేసులు, కర్ణాటక, 1,233 కేసులు, రాజస్థాన్‌, మిజోరంలలో 1,151 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి కనీసం 60.92 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో రికవరీ రేటు ఇప్పుడు 98.21 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 60,298 మంది రోగులు కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,20,37,536కి చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,02,505 ఉండగా, మరణాల సంఖ్య 5,11,230కి చేరింది.ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ సంఖ్య 175.03 కోట్లకు చేరినట్లు కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img