Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కేసులు నమోదవుతున్నాయి. . గడిచిన 24 గంటల్లో గురువారం దేశవ్యాప్తంగా 2,528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 149 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.40 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 29,181 (0.07%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,24,58,543కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,16,281 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక బుధవారం దేశవ్యాప్తంగా 2,539 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 1,80,97,94,58 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది. ఇప్పటికవరకు 78.18 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇందులో నిన్న ఒక్కరోజే 6,33,867 మందికి పరీక్షలు చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img