Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో నేడు స్వల్వంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,38,018 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా.. కరోనాతో 310 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి 1,57,421 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,36,628కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 94.09% కాగా.. మరణాల రేటు 1.29%గా ఉంది. కోవిడ్‌ టెస్టుల పాజిటివిటీ రేటు 14.43% శాతానికి పెరిగింది.మరోవైపు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 9 వేలకు చేరువైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8,891 మందిలో కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిరచాయి. క్రితం రోజుతో పోలిస్తే ఒమిక్రాన్‌ కేసులు 8.31 శాతం పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న మరో 79.91 లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 158.04కోట్ల డోసులను పంపినీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. 1518 ఏళ్ల వారిలో 3.59 లక్షల మందికి తొలిడోసు టీకాలను అందించినట్లు తెలిపింది. ఇక దేశంలో 1214 ఏళ్ల పిల్లలకు మార్చి నుంచి టీకాలు పంపిణీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు స్పందించాయి. ఈ వయసు వారికి టీకాల పంపిణీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ వర్గాలు వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img