Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గాయి. కరోనా థర్డ్‌వేవ్‌ అనంతరం రోజువారి కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో ఆదివారం కేసుల సంఖ్య మరింత భారీగా తగ్గింది. తాజాగా అవి 8 వేలకు తగ్గాయి. దీంతో ఇది నిన్నటికంటే 21.99 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కరోనా మూడోవేవ్‌ ప్రారంభమైన తర్వాత రోజువారీ కేసులు పది వేల లోపు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 119 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.11 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడిరచింది. దేశంలో ప్రస్తుతం 1,02,601 (0.24%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,24,130 కి పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,13,843 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. . కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 16,765 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,07,686 కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,77,50,86,335 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img