Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్‌ కేసులు

527 రోజుల కనిష్టానికి యాక్టివ్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,197 కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి నిన్న 301 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,66,598 కి చేరగా.. మరణాల సంఖ్య 4,64,153 కి పెరిగాయి. కాగా నిన్న కరోనా నుంచి 12,134 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3.38,73,890 కి చేరాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 527 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 0.82 శాతంగా ఉంది. 44 రోజుల తర్వాత గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img