Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులపై ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. మొన్నటి వరకూ 10 వేల లోపే ఉన్న కరోనా కేసులు.. రెండు మూడు రోజులుగా రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న 20 వేలకు పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 22,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 406 మంది మృతి చెందారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,04,781కి చేరింది. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 1,431కి చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 200 కేసులు పెరగడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్‌ సోకగా దిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ విస్తరించింది. మరోవైపు ఇప్పటివరకు 488 మంది కొత్త వేరియంట్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక దేశంలో నిరంతరాయంగా టీకా పంపిణీ సాగుతోంది. శుక్రవారం 58.11 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 1.45 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇక జనవరి 3 నుంచి 15।`18 ఏళ్ల వారికి కూడా టీకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img