Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో మళ్లీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పెంపు


చమురు సంస్థలు ఉదయాన్నే సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి. పెట్రోల్‌ డీజిల్‌తోపాటు వంటగ్యాస్‌ ధరలను కూడా పెంచాయి. గత అక్టోబర్‌లో రూ.15 పెరిగిన వంట గ్యాస్‌ ధర అప్పటి నుంచి నిలకడగా ఉంది. తాజా 14 కేజీల సిలిండర్‌పై ధర రూ.50 పెరిగింది. దీంతో తెలంగాణలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,002కు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,008కు పెరిగింది. ఇప్పుడు ఢల్లీి, ముంబైలలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.949.50కు పెరిగింది. కోల్‌కతాలో వినియోగదారుడు సిలిండరుకు రూ.976 చెల్లించాల్సి ఉంటుంది.చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50కి పెంచారు.పాట్నాలో కూడా ధరలు పెంచారు. పాట్నాలో ఎల్‌పిజి సిలిండర్‌ ఇప్పుడు రూ. 1,039.50కి విక్రయిస్తున్నారు. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి వచ్చినట్టు చమురుసంస్థలు వెల్లడిరచాయి. ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img