Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో గత కొద్దికాలంగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు దేశంలో 23 కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,439 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా నమోదయ్యాయి. కరోనా బారిన పడి నిన్న 195 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 93,733 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 555 రోజుల తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికిపైగా ఉంది.తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,56,822 కి చేరగా.. మరణాల సంఖ్య 4,73,952 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 9,525 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,40,89,137 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 129.5 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img