Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు..

534 రోజుల కనిష్టానికి క్రియశీల కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య తగ్గింది. నిన్న ఆదివారం దేశవ్యాప్తంగా 8,488 కేసులు నమోదయ్యాయి. 534 రోజుల తర్వాత కేసుల సంఖ్య భారీగా పతనమైనట్లు కేంద్రం వెల్లడిరచింది. కరోనాబారినపడి నిన్న 249 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా నిన్న నిన్న నమోదైన కేసులు, మరణాల్లో కేరళలోనే ఎక్కువగా నమోదయ్యాయి. కేరళలో నిన్న 5080 కేసులు నమోదుకాగా.. 40 మంది మరణించారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. . ప్రస్తుతం దేశంలో 1,18,443 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 534 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. . దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది మరణించారు. కాగా నిన్న కరోనా నుంచి 12,510 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,39,34,547 కి చేరాయి.ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 116.87 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img