Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో వరుసగా రెండో రోజూ 2 వేలకు పైనే కరోనా కొత్త కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళ, మిజోరాం, ఉత్తరప్రదేశ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లో కూడా వైరస్‌ ఉనికి చాటుతోంది. గురువారం కేంద్రం వెల్లడిరచిన గణాంకాల ప్రకారం, బుధవారం 2067 మంది కరోనా బారినపడగా, కొత్తగా 2380 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,30,49,974కు చేరాయి. ఇందులో 4,25,14,479 మంది కోలుకోగా, 5,22,062 మంది మృతిచెందారు. 13,433, కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటివీ రేటు 0.53 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 56 మంది కరోనాకు బలవగా, 1231 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. 4.5 లక్షల మందికి పరీక్షలు చేశామని తెలిపింది. ఇప్పటివరకు 187.07 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img