Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో 653 ఒమిక్రాన్‌ కేసులు..

కొత్తగా 6,358 మందికి కరోనా
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.నిన్న 10,35,495 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,358 మందికి కరోనా పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం 75,456 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న కరోనా నుంచి 6,450 మంది కోలుకున్నారు. అలాగే కోవిడ్‌ రీకవరి రేటు 98.40 శాతంగా నమోదు అయ్యింది మార్చి తర్వాత రికవరీ రేటు భారీ స్థాయిలో పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇక దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరపెడుతోంది.భారత్‌లో ఇప్పటివరకు 653 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అయితే.. ఇప్పటివరకు 186 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఎక్కువగా ఢల్లీి, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, గుజరాత్‌, రాజస్థాన్లో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 167 కేసులు నమోదు కాగా.. ఢల్లీిలో 165 కేసులు ఉన్నాయి. కేరళలో 57 కేసులు, తెలంగాణలో 55, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 46 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img