Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశం గర్విస్తోంది


భారత మెన్స్‌ హాకీ జట్టుకు మోదీ అభినందనలు
భారత మెన్స్‌ హాకీ జట్టును చూసి దేశం గర్విస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. నేరుగా జట్టు కెప్టెన్‌ మన్‌ ప్రీత్‌సింగ్‌కు నేరుగా ఫోన్‌ చేసి అభినందించారు. ‘‘మీకు, మీ యావత్తు జట్టుకు అభినందనలు. మీరంతా చాలా గొప్ప కృషి చేశారు. యావత్తు దేశం నాట్యం చేస్తోంది. నా మనసంతా సంతోషంగా ఉంది. జట్టు సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేయండి. ఆగస్టు 15న మనమంతా కలుసుకుందాం. అందరినీ ఆహ్వానించాను’’ అని తెలిపారు. మన్‌ప్రీత్‌ మాట్లాడుతూ.. ‘మీ దీవెనలే మమ్మల్ని గెలిపించాయి’ అని తెలిపారు. సెమీస్‌ తర్వాత కూడా మోదీ ఫోన్‌ చేశారని..ఆ విషయాన్ని మన్‌ప్రీత్‌ గుర్తు చేస్తూ..మీరు ఇచ్చిన స్ఫూర్తి పనిచేసిందన్నారు. మరోవైపు హాకీ టీమ్‌ సభ్యులు అద్భుత విజయం సాధించారంటూ భారత జట్టుకు అభినందనలు అని అమరీందర్‌ ట్వీట్‌ చేశారు. హాకీ టీమ్‌కు పంజాబ్‌ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కాంస్య పతకం సాధించిన జట్టుపై ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం భారత్‌, జర్మనీ హాకీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5-4 తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img