Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకం

చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ
ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు అని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగసభలో నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమని కొనియాడారు. అభివృద్ధికి పోర్టులు చాల అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు ఇస్తామని, 22 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు ప్లాన్‌ చేస్తున్నామని, అందులో 6 ఏపీలో ఉంటాయని తెలిపారు. విశాఖ నుంచి రాయపూర్‌ 16,102 కోట్ల విలువైన రోడ్‌ నిర్మిస్తామని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే 2024 లోపే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవేను 2025 నాటికి పూర్తిచేస్తామని, హైదరాబాదు-విశాఖ ప్రాజెక్ట్‌ 2025 నాటికి పూర్తవుతుందని వివరించారు. ‘‘బెంగళూరు-చెన్నై 17 వేల కోట్ల ప్రాజెక్టు ద్వారా.. ఏపీ, కర్నాటక, తమిళనాడు మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముంబై-ఢల్లీి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై గంటకు 160 కి.మీ. వేగంతో వెళ్లవచ్చు. గ్రీన్‌ హైడ్రోజన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు చూస్తున్నాం. విజయవాడ తూర్పు రింగ్‌ రోడ్‌కు అనుమతిస్తున్నాం. 50 శాతం ల్యాండ్‌ పూలింగ్‌ ఖర్చు కేంద్రానిదే. ఏపీ సీఎం 20 ఆర్‌ఓబీలు అడిగారు, మేం 30 ఆర్‌ఓబీలకు అనుమతిస్తున్నాం’’ అని ప్రకటించారు.
ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కీలకమైనవి. వ్యవసాయరంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. రైతులు, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత తాను వ్యక్తిగతంగా ఏపీకి వస్తానని మంత్రి తెలిపారు. తాను జలవనరుల మంత్రి కానప్పటికీ పోలవరం ప్రాజెక్టును చూస్తానని అన్నారు. జలాలు సముద్రంలో కలవకముందే నదులను అనుసంధానించుకుందామని గడ్కరీ సూచించారు. అలాగే.. పరిశ్రమలతోనే ఉపాధి కల్పన సాధ్యమన్నారు. ఇథనాల్‌ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలని నితిన్‌ గడ్కరీ ఆకాంక్షించారు. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అవుతుందని తెలిపారు. త?్వరలో డీజిల్‌ లారీలకు బదులుగా ఎలక్ట?క్ర్‌ి లారీలు, డీజిల్‌ స్థానంలో సిఎన్‌జీ, ఎల్‌పిజి రవాణా వాహనాలు వస్తాయని సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం తగ్గి.. గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img