Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ద్రవ్యోల్బణం దెబ్బ

పేదరికంలోకి 7.1 కోట్లు

40శాతం ఆదాయం ఆహారం కోసమే
క్షుద్బాధను అనుభవిస్తున్న 230కోట్లు మంది
యూఎన్‌డీపీ నివేదికల వెల్లడి
ఇంధన సబ్సిడీలకు బదులు పేదల నగదు బదిలీకి సిఫార్సు

దుబాయి: ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం నెలల తరబడి సాగుతున్న క్రమంలో ఆహారం, ఇంధనం ధరలు తారస్థాయికి చేరుకోగా అధిక ద్రవ్యోల్బణం పర్యవసానంగా ప్రపంచంలో 71 మిలియన్ల (7.1కోట్లు) మంది పేదరికంలోకి వెళ్లారని గురువారం వెలువడిన ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నివేదిక వెల్లడిరచింది. ప్రపంచంలో 2.3 బిలియన్ల (230 కోట్లు) మంది క్షుద్బాధను అనుభవిస్తున్నట్లు మరొక నివేదిక తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం ఎంతైనా అవసరం అని యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్‌ అచిమ్‌ స్టెయినర్‌ అన్నారు. కోట్లాది డబ్బును ఇంధన సబ్సిడీలపై వెచ్చించడానికి బదులుగా పేదలకు నగదు బదిలీలు చేపట్టాలని యూఎన్‌డీపీ సిఫార్సు చేసింది. 51.6 మిలియన్ల (51,600,000) మంది ఉక్రెయిన్‌రష్యా యుద్ధం మొదలైన మూడు నెలల్లోనే పేదరికంలోకి వెళ్లారు. దీంతో ప్రపంచ జనాభాలో తొమ్మిది శాతం దారిద్య్ర రేఖకు దిగువ స్థాయికి చేరుకున్నారు. తక్కువ ఆదాయ దేశాల్లోని కుటుంబాలు తమకొచ్చే ఆదాయంలో 42శాతానికిపైగా ఆహారం కోసం వెచ్చిస్తున్నారని తెలిపింది. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు పెరిగిన క్రమంలో ఇంధనం, గోధుమలు, చక్కెర, వంట నూనె వంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఉక్రెయిన్‌ పోర్టుల దిగ్బంధనం, ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. కొన్ని కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువకు చేరుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి వేళ లాక్‌డౌన్‌ల క్రమంలో 18 నెలల్లో 125 మిలియన్ల (12.5కోట్లు) మంది పేదరికాన్ని అనుభవించగా, ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్‌రష్యా యుద్ధం క్రమంలో మూడు నెలల్లో 7.1 కోట్ల మంది పేదరికం గుప్పెట్లో చిక్కుకున్నారని యూఎన్‌డీపీ వెల్లడిరచింది. ఇది శీఘ్రగతిన జరిగిందని యూఎన్‌డీపీ ప్రధాన ఆర్థికవేత్త, నివేదిక రూపకర్త జార్జ్‌ మొలినా అన్నారు. అధిక ద్రవ్యోల్బణం అత్యధిక ప్రభవం హైతీ, అర్జెంటైనా, ఈజిప్టు, ఇరాక్‌, టర్కీ, ఫిలిప్పీన్స్‌, ర్వండా, సుడాన్‌, కెన్యా, శ్రీలంక, ఉజ్జెకిస్థాన్‌ దేశాలపై పడగా ఆఫ్ఘాన్‌, ఇథియోపియా, మాలి, నైజీరియా, యమన్‌ దేశాలపై మరింత ఎక్కువగా ప్రభావం కనిపించిందని నివేదిక వెల్లడిరచింది. పేదరికం అంచునకు చేరుకున్న వారు లేదా పేదరికాన్ని అనుభవిస్తున్న వారి సంఖ్య ఐదు బిలియన్లకుపైగా ఉందని యూఎన్‌డీపీ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img