Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ధరాభారంలో దసరా

పండుగ చేసుకునేదెట్ట.. సామాన్యుల ఆవేదన
చుక్కల్లో వంటనూనె ధర
రెట్టింపైన కూరగాయల ధరలు

న్యూదిల్లీ : దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే దసరా పండుగకు పది రోజుల ముందు నుంచే ఎక్కడ చూసినా సందడి ఉండేది. నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు. ధరాభారంతో ప్రజలు సతమతమవుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో సంవత్సరంన్నర కాలంగా ఉపాధి లేక రోజు గడవటమే కష్టంగా మారింది. పండుగుల సందడే కరువైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాలతో పరిస్థితులు మరింత విపత్కరంగా మారాయి. పండుగ పూట ఆనందంగా ఉండేందుకు అవకాశం లేకుండా పోయింది. వంటనూనెల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయి. దీంతో రవాణ ఖర్చులు పెరగడంతో దాదాపు అన్ని వస్తువుల ధరలూ అమాంతం పెరిగాయి. నిత్యావసరాల నుంచి పండుగకు కొనుక్కునే కొత్త బట్టల వరకూ ప్రతిదీ అందనంత ఎత్తులో ఉన్నాయి. ఓ వైపు కోవిడ్‌తో ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి ఉపాధికి దూరమైన పేద, మధ్యతరగతి ప్రజానీకం.. ఈ పండుగలను ఎలా జరుపుకోవాలని ఆందోళన చెందుతోంది. మోడీ సర్కారు నిత్యావసర ధరలపై నియంత్రణ ఎత్తేయడంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. పైగా దసరాకు మామ్మూళ్లు కూడా ఉండడంతో సామాన్యుడు కుడితిలోపడ్డ ఎలుకలా గిలగిలలాడుతున్నాడు. వంటనూనె లీటర్‌ రూ.150పైనే ఉంది. బెల్లం 40 నుంచి 60 రూపాయలైంది. పంచదార రూ.38 నుంచి 45కు పెరిగింది. పప్పుల ధరలన్నీ 110-130 మధ్య ఉన్నాయి. వేరుశెనగ గుండ్లు కిలో రూ. 125పైనే ఉన్నాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వారం రోజుల కిందట ధరలతో పోలిస్తే ప్రస్తుతం రెండిరతలు పెరిగాయి. కరోనా నేపథ్యంలో వస్త్ర వ్యాపారం కూడా మందగించింది. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుడు పండుగకు దూరంగానే ఉన్నాడని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img