Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

నగరాలను చెత్త రహితంగా చేయడమే లక్ష్యంగా…

: ప్రధాని మోదీ
నగరాలను చెత్త రహితంగా చేయడమే స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0 లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ అర్బన్‌ 2.0, అమృత్‌ 2.0 కార్యక్రమాలను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. దేశంలోని అన్ని నగరాలకు చెత్త నుంచి విముక్తి కల్పించడం, నీటి భద్రత కల్పించడం లక్ష్యాలుగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌-అర్బన్‌ 2.0, అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (అమృత్‌) 2.0లను రూపొందించారు. ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ శుక్రవారం న్యూఢల్లీిలోని డాక్టర్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను అందుకోవడంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0 కీలకంగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పట్టణాభివృద్ధి వల్లే సమానత్వం సాధ్యమవుతుందన్నారు. 2014లో స్వచ్ఛ భారత్‌ మొదలు పెట్టిన సమయంలో కేవలం 20 శాతం మాత్రమే చెత్తను శుద్ధి చేసేవారని, ఇప్పుడు 70 శాతం చెత్తను ప్రతి రోజు ప్రాసెస్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాన్ని వంద శాతానికి తీసుకురావాలని ప్రధాని చెప్పారు.ఈ రెండో దశలో మురుగు నీటి పారుదల, భద్రతా నిర్వహణలను సాధించాలనుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img