Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నారీశక్తికి సెల్యూట్‌ : మోదీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో పనిచేస్తోన్న నారీశక్తికి సెల్యూట్‌ అని ట్వీట్‌ చేశారు. ‘మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో పనిచేస్తోన్న నారీశక్తికి నా సెల్యూట్‌. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుటుంది. ఇందుకోసం వివిధ పథకాల ద్వారా కృషి చేస్తోంది. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, అన్ని రంగాల్లో వారికి అవకాశం కల్పించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఆర్థిక, సామాజిక భద్రత, నాణ్యమైన హెల్త్‌ కేర్‌ నుంచి హౌసింగ్‌ వరకు, విద్య నుంచి పారిశ్రామికి రంగం వరకు భారత అభివృద్ధి ప్రయాణంలో మహిళల పాత్రను పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత కృషి చేస్తాం.’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img