Friday, April 19, 2024
Friday, April 19, 2024

నాల్గో దశ పొంచివుంది…జాగ్రత్త…

ఐదెంచల వ్యూహాన్ని కొనసాగించాలి
ఆగ్నేయాసియాలో కోవిడ్‌ విజృంభణతో కేంద్రం అప్రమత్తం

ఐఎల్‌ఐ, ఎస్‌ఏఆర్‌ఐ కేసులపై మళ్లీ నిఘా రాష్ట్రాలకు తాజా ఆదేశాలు న్యూదిల్లీ : కోవిడ్‌ మహమ్మారి మరోమారు దేశాన్ని కలవపాటుకు గురిచేస్తోంది. నాల్గో దశ పొంచివుందన్న అంచనాలతో ప్రజలు భయపడుతున్నారు. ఆగ్నేయాసియాతో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తం అయింది. దేశంలో ఐదెంచల వ్యూహాన్ని కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ఐఎల్‌ఐ, ఎస్‌ఏఆర్‌ఐ కేసులపై నిఘా పెంచాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతానికి 4,30,04,005 క్రియాశీల కేసులు ఉండగా 685 రోజుల్లో 30,000 కేసులు తగ్గాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇన్‌ఫుయెంజా తరహా వ్యాధులు (ఐఎల్‌ఐ), తీవ్రమైన శ్వాస సంబంధిత రోగాల (ఎస్‌ఏఆర్‌ఐ)పై పర్యవేక్షణను పున:ప్రారంభించాలనిఆదేశాలు జారీచేసింది. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో దేశంలో వైరస్‌ పరీక్షలు నెమ్మదించాయి. ఇప్పుడు మళ్లీ ఐఎల్‌ఐ, ఎస్‌ఏఆర్‌ఐ కేసులు పెరుగుతున్న క్రమంలో నిఘా పెంచడం, కోవిడ్‌ పరీక్షలను చేపట్టడం, పాజిటివ్‌ వస్తే ఆ నమూనాలను జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపడం వంటి చర్యలను తిరిగి చేపట్టాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ పంపారు. వాక్సిన్‌ వేయించుకునేలా ప్రజలను చైతన్యపర్చాలని, కోవిడ్‌ కట్టడి మార్గదర్శకాలు జారీచేయాలని, దానిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పష్టంచేశారు. కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేలా ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ నెట్వర్క్‌కు తగినన్ని నమూనాలను పంపాలని ఆదేశించారు. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీటింగ్‌తో పాటు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని లేఖలో రాజేశ్‌ నొక్కిచెప్పారు. కోవిడ్‌ జాగ్రత్తలు, చేతులను ఎలా శుభ్రపర్చుకోవాలో ప్రజలకు తెలపాలని రాష్ట్రాలకు సూచించారు. ఆగ్నేయాసియా, ఐరోపాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవియా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం 16వ తేదీన జరిగిందని, కోవిడ్‌ కట్టడికి చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలకు సూచించినట్లు లేఖలో భూషన్‌ తెలిపారు. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వాక్సినేషన్‌, కోవిడ్‌ కట్టడి ప్రవర్తన రూపేణ ఐదంచెల వ్యూహంపై తిరిగి దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే క్రమంలో నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. అర్హులైన వారంతా తప్పనిసరిగా కోవిడ్‌ టీకా తీసుకోవాలన్నారు. దేశంలో 2,528 కొత్త కేసులు 149 మరణాలు
దేశంలో 2,528 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 4,30,04,005కి పెరిగిందని, క్రియాశీల కేసుల్లో 30వేల మేర తగ్గుదల 685 రోజుల తర్వాత కనిపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే, కొత్తగా 149 మంది మరణించగా మృతుల సంఖ్య 5,16,281కి పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు రికవరీ రేటు 98.73శాతంగా ఉందని తెలిపింది. 24 గంటల్లో 1,618 యాక్టివ్‌ కేసులు తగ్గాయని డేటా చెబుతోంది.ఒక్క రోజులో 6,33,867 కోవిడ్‌ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశంలో 78.18 కోట్ల మందికి కోవిడ్‌ సోకగా 4,24,58,543 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.20శాతమని చెబుతోంది. 180.97 కోట్లకుపైగా వ్యాక్సిననేషన్‌ తీసుక్నుట్లు డేటా తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img