Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నిండుకుండలా గోదావరి

ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు
గత కొద్దిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది నిండుకుండలా కళకళలాడుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో రాజమండ్రి వద్ద గోదావరి నదిలో జల కళ మొదలైంది. నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద 10.7 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుండి మూడు డెల్టా కాల్వలకు 9 వేల 180 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బ్యారేజ్‌ నీటిమట్టం పెరుగుతోంది. గత నెల ఒకటవ తేదీ నుండి ధవళేశ్వరం బ్యారేజీ నుండి డెల్టాలోని మూడు కాలువలకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు.వర్షాభావం పరిస్థితులతో నదిలో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ఈనెల ఒకటి నుండి గోదావరి జిల్లాలతోపాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో నీరు భారీగా గోదావరిలోకి వచ్చి చేరుతుంది. గోదావరి నీటిమట్టం కనిష్ఠ స్థాయిలోకి పడిపోవడంతో ధవళేశ్వరం నుండి విజ్జేశ్వరం వరకు బ్యారేజీకి ఉన్న 175 గేట్లు మూసివేసి ఎగువ ప్రాంతాల్లో నుండి వస్తున్న నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. నీటిమట్టం భారీగా పెరగడంతో ఒకటి, రెండు రోజుల్లో బ్యారేజీ నుండి గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img