Friday, April 19, 2024
Friday, April 19, 2024

నిబంధనలను నిష్పాక్షికంగా అమలు చేస్తాం : ట్విట్టర్‌

కాంగ్రెస్‌ నేతల ఖాతాలను బ్లాక్‌ చేయడంపై వస్తున్న ఆరోపణలపై ట్విట్టర్‌ గురువారం స్పందించింది. ‘మా సేవలను వినియోగించుకునే ప్రతి ఒక్కరికీ నిబంధనలను వివేకవంతంగా, నిష్పాక్షికంగా అమలు చేస్తాం. మా నిబంధనలను ఉల్లంఘించే చిత్రాలను పోస్టు చేసిన వందలాది ట్వీట్లపై ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకున్నాం.’ అని ట్విటర్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, భద్రతలను పరిరక్షించడమే ఎల్లప్పుడూ మా లక్ష్యం. ట్విటర్‌ రూల్స్‌ను అందరూ తెలుసుకోవాలి. ఏదైనా ఉల్లంఘన ఉన్నట్లు విశ్వసిస్తే, దానిని మాకు తెలియజేయండి’ అని తెలిపారు. లైంగిక దాడి కేసులో ఆరోపిత బాధితురాలి (ఓ మైనర్‌ బాలిక) తల్లిదండ్రుల వివరాలను వెల్లడిరచినట్లు నిర్దిష్టంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) తమకు తెలియజేసిందని పేర్కొన్నారు. అందుకే కొన్ని ట్విటర్‌ ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ సహా మరికొందరు పార్టీ సీనియర్‌ నేతల అధికారిక ఖాతాలను ట్విటర్‌ బ్లాక్‌ చేసింది. దిల్లీలో తొమ్మిదేళ్ళ బాలికపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ నెల 4న రాహుల్‌గాంధీ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫొటోను రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img