Friday, April 19, 2024
Friday, April 19, 2024

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

2.30 లక్షల ఖాళీలు భర్తీ చేయాల్సిందే
పోలీసులతో ఉద్యమాలను అణగదొక్కలేరు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో ` తిరుపతి : నిరుద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్‌ చెలగాటం ఆడుతున్నారని ఎన్నికల ముందు ఒక మాట, అధికారం చేపట్టాక మరో మాట చెప్పి మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే జగన్‌ ప్రకటించిన ప్రతి పథకంలో కోత విధిస్తున్నారన్నారు. తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బండి చలపతి, తెలుగు యువత అధ్యక్షులు రవి నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాధవ్‌ అధ్యక్షతన జాబ్‌ క్యాలెండర్‌ రద్దు చేయాలని కోరుతూ సోమవారం నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు రామకృష్ణతోపాటు మాజీ మంత్రులు పరసారత్నం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా .రామకృష్ణ మాట్లాడుతూ 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చిలక పలుకులు పలికిన జగన్‌ నేడు కేవలం 10 వేల ఉద్యోగాలకు మాత్రం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురా లేదన్నారు. రాజకీయ కక్ష సాధింపుతో ఉన్న ఫ్యాక్టరీలను మూత వేయించే దిశగా చర్యలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతున్నప్పటికీ జగన్‌ చూస్తూ నాటకాలు ఆడుతున్నారన్నారు. సుమారు 40వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న అమర్‌ రాజా వంటి ఫ్యాక్టరీలను కూడా ఉంటే ఉండండి లేదా వెళ్లిపొండి అంటూ వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విద్యార్థులు శాంతియుత ఆందోళనకు దిగితే కనీసం మైక్‌ పర్మిషన్‌ కూడా ఇవ్వకుండా శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టి అణచివేయాలని కుట్ర చేయడం తగదన్నారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌ బాబు, ఏఐఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, డివైఎఫ్‌్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ చంద్ర, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రవి చంద్ర మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో జగన్‌ చెల గాటం ఆడుతున్నారని ఎన్నికల ముందు ఒక మాట, అధికారం చేపట్టాక మరో మాట చెప్పి మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వదిలిన జాబ్‌ క్యాలెండర్లో ఒక టీచర్‌ పోస్టు కూడా లేకపోవడం చాలా అన్యాయమన్నారు. టీడీపీ తిరుపతి పార్ల మెంట్‌ అధ్యక్షులు నరసింహ యాదవ్‌, సుగుణమ్మ, పర్సా రత్నం, రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి తక్షణం కొత్త క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టులు తక్షణం భర్తీ చేయాలని, కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులను సైతం పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీక్షలకు అనేక పార్టీల, ప్రజా సంఘాల నాయకులు సంఫీుభావం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img