Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నిష్పాక్షిక, సమ్మిళిత విద్యతోనే దేశాభివృద్ధి : ప్రధాని మోదీ

దేశాభివృద్ధికి న్యాయమైన, నిష్పాక్షిక, సమ్మిళిత విద్య చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. శిక్షక్‌ పర్వ్‌ కాంక్లేవ్‌ ప్రారంభం సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ, విద్య అనేది కేవలం సంఘటితమైనదిగా ఉంటే సరిపోదని, నిష్పాక్షికమైనదిగా కూడా ఉండాలన్నారు. దీని కోసం మన దేశం ఆడియో బుక్స్‌ను ఉపయోగించుకుంటోందన్నారు. యూనివర్సల్‌ డిజైన్‌ లెర్నింగ్‌ (యూడీఎల్‌)ను ఆధారంగా చేసుకుని దేశంలో ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ డిక్షనరీని రూపొందించారని తెలిపారు.మన దేశంలో మొట్టమొదటిసారి భారతీయ సంకేత భాషను పాఠ్య ప్రణాళికలో ఓ సబ్జెక్ట్‌గా చేర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ భారతీయ సంకేత భాషా నిఘంటువు, టాకింగ్‌ బుక్స్‌, పాఠశాల నాణ్యత భరోసా, సీబీఎస్‌ఈ మదింపు నిబంధనావళిబీ నిష్ఠ టీచర్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌, విద్యాంజలి పోర్టల్‌లను ఆవిష్కరించారు.జాతీయ పురస్కారాలను స్వీకరించిన ఉపాధ్యాయులను మోదీ ఈ సందర్భంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img