Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నీట్‌ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలి

తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
నీట్‌ పరీక్షపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీలో సోమవారం బిల్లు ప్రవేశపెట్టారు. నీట్‌కి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని అసెంబ్లీ లో సీఎం స్టాలిన్‌ వెల్లడిరచారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ప్రతిపక్ష అన్నా డీఎంకే మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసింది.తమిళనాడులో నీట్‌ జరుగుతుందా లేదా తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని, చివరికి విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా అసెంబ్లీలో చర్చించనివ్వలేదని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు.నీట్‌ను రద్దు చేస్తారనుకొని విద్యార్థులు ఆ పరీక్షకు సిద్ధం కాలేదని, ఆ విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. దీనికి నిరసనగా వాకౌట్‌ చేస్తున్నాం. అయితే నీట్‌ తీర్మానానికి మద్దతిస్తున్నాం అని పళనిస్వామి అన్నారు. 2017లో కూడా తమిళనాడు ప్రభుత్వం నీట్‌ వద్దని కోరుతూ బిల్‌ ప్రవేశ పెట్టింది. కానీ, దానికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. మరి ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img