Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నీట్‌ రద్దు కుదరదు

న్యూదిల్లీ : జాతీయ అర్హత ప్రవేశపరీక్ష, అండర్‌గ్రాడ్యుయేట్‌ (నీట్‌, యూపీ) పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సెప్టెంబరు 12న నీట్‌ పరీక్ష జరిగింది. అయితే పరీక్ష పారదర్శకంగా న్యాయంగా జరగలేదని, దానిని రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు అయింది. లక్షలాది మంది విద్యార్థులను పణంగా పెట్టడం సబబు కాదని, పరీక్ష రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు నేతృత్వ ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తొలుత రూ.5లక్షల జరిమానా విధించాలని భావించిన ధర్మాసనం అనంతరం ఆ ఆలోచను ఉపసంహరిం చుకొని పిటిషన్‌ను కొట్టివేసింది. నీట్‌`యూజీ పరీక్షను రద్దు చేసి, పరీక్షలను మరలా నిర్వహిం చాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి ఆదేశాలు ఇవ్వా లని ఫిర్యాది కోరారు. పరీక్షలో అవకతవకలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ నమోదు చేసింది. అభ్యర్థుల స్థానంలో వేరొకరు పరీక్ష రాసినట్లు ఫిర్యాదులో ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ‘అధికరణ 32 కింద ఏ తరహా రిట్‌లు దాఖలు అవుతాయి? లక్షలాది మంది ఈ పరీక్ష రాశారు. ఇటువంటి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మొత్తం పరీక్షను రద్దు చేయమని అంటున్నారు…వాదిస్తున్నారు. దీనిపై సమగ్రంగా విచారిస్తాం. మీపై ప్రత్యేక దృష్టి పెడతాం’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయి హెచ్చరించారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది నినంద్‌ డోగ్రా కోర్టు హాజరయ్యారు. సీబీఐ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని, వాట్సాప్‌లో పరీక్షా పత్రాలు లీకయ్యాయని వెల్లడిరచారు. 20ఏళ్ల పిటిషనర్‌ సలోని దాఖలు చేసిన ఫిర్యాదును ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇకపై నీట్‌-2021 పరీక్ష రద్దును కోరే ఎటువంటి అభ్యర్థనలు స్వీకరించబోమని తేల్చిచెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img