Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నెలరోజులకు సరిపడా నిల్వలు.. కొరత లేదు: కేంద్రం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ప్లాంట్లలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. 30 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నందున భయపడాల్సిన అవసరమేదీ లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం కోల్‌ ఇండియా వద్ద 72.5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉందని వర్గాలు పేర్కొన్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద మరో 22 మిలియన్‌ టన్నుల మేర నిల్వలు ఉన్నాయని తెలిపాయి. రోజూ సగటున 2.1 మిలియన్‌ టన్నుల బొగ్గు ప్లాంట్లకు వస్తోందని, దేశంలో బొగ్గు కొరతకు అవకాశమే లేదని ఆయా వర్గాలు వెల్లడిరచాయి. పవర్‌ ప్లాంట్ల వద్ద 10 రోజులకు సరిపడా నిల్వలు ఉండగా.. మొత్తంగా నెల రోజులకు తగ్గ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు సరిపడా లేవని, దీనివల్ల విద్యుత్‌ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందంటూ అఖిల భారత విద్యుత్‌ ఇంజనీర్ల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ నివేదికను పరిశీలిస్తే.. దేశీ బొగ్గును వినియోగించే 150 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు గానూ 81 చోట్ల నిల్వలు క్షీణించినట్లు తెలుస్తోందని సమాఖ్య చైర్మన్‌ శైలేంద్ర ధూబే అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు బొగ్గు నిల్వలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. మరోవైపు పవర్‌ ప్లాంట్లతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని మరో అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img