Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేయాలి

మావి మాకిచ్చేందుకు డబ్బుల్లేవా?
హెల్త్‌ కార్డు అనారోగ్య కార్డుగా మారింది
ఉద్యోగ సంఘాల నాయకులు

విశాలాంధ్ర`విజయవాడ( గాంధీనగర్‌) : రాష్ట్రంలో గత మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఏపీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరలేదని వాపో యాయి.ఉద్యోగులంతా ఉద్యమానికి దిగే పరిస్థితి తీసుకురావొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. పీఆర్‌సీ నివేదిక ఇవ్వకపోవడంపై నిన్న భగ్గుమన్న వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శనివారం ఇక్కడి ఏపీ ఎన్‌జీవో సంఘ కార్యాల యంలో మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల పీఆర్సీ నివేదికపై ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని ఆ లోగా ప్రకటించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో ఈ నెల 28న ఉమ్మడి సమావేశం తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీి జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీి జేఏసీి అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నిన్నటి సమావేశంలో పీఆర్సీపై ఎలాంటి నిర్ణయమూ జరగలేదని పెండిరగ్‌ బిల్లులు ఖచ్చితంగా ఎప్పుడు పూర్తిచేస్తారో కూడా ప్రభుత్వం చెప్పలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు . రెండు ఐకాసలలో సుమారుగా 200 సంఘాలు ఉన్నాయన్నారు. పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులందరికీ నిరాశే మిగిలిందని అవేదన వ్యక్తం చేశారు.ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.ఈ నెల 27 లోపు ఏపీ ఎన్జీవో సంఘం, 28న ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి సమావేశాలు నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. ఉమ్మడి సమావేశాల అనంతరం ఛీప్‌ సెక్రటరీకి మెమోరాండం ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.ఉద్యోగులు ప్రభుత్వం వద్ద దాచుకున్న డబ్బులు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .మాటలతో కాలయాపనే తప్ప, తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మేనిఫెస్టో చూసి ఉద్యోగులు చాలా ఆశించారనీ, ఆర్థిక , ఆర్థికేతర డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని భావించామనీ, నిరాశే ఎదురైందని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అవసర లేదా అని ప్రశ్నించారు. వైసీపీి ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడేళ్లలో ఉద్యోగుల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీని పూర్తిగా మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులు, అధికారుల కమిటీలు అంటూ నివేదికలు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు.అనాటి ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ పెండిరగ్‌ ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్కరోజు ఆలస్యం లేకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కమిటీ నివేదికలోనూ ఆలస్యం చేస్తూ వచ్చారని విమర్శించారు. ఆరు నెలల తర్వాత అధికారుల కమిటీ నియమించి అధ్యయనం చేస్తోందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలన్నీ కాలయాపనకే తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు . హెల్త్‌ కార్డు అనారోగ్య కార్డుగా మారిందన్నారు. కనీసం రీయింబర్స్‌మెంట్‌ కింద ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోపు పీఆర్సీ ప్రకటించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కెేవీ శివారెడ్డి, ఏపీి జేఏసీి అమరావతి అసోసియేట్‌ చైర్మన్‌ టీవీ ఫణిరాజు, కోశాధికారి వీవీ మురళీకృష్ణ నాయుడు,ఏపీి జేఏసీ కో`ఛైర్మన్‌ బి.కిషోర్‌కుమార్‌,ఏపీ జేఏసీి జనరల్‌ సెక్రటరీ జి.హృదయరాజు, జీవీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img