Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

నేటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

15 నుంచి 18 ఏళ్ల లోపు టీనేజర్లకు కూడా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఈరోజు అంటే జనవరి 1 వతేదీ నుంచి కోవిన్‌ యాప్‌ లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు కోవిన్‌ ప్లాట్‌ఫామ్‌ చీఫ్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ తెలిపారు. వీరంతా కోవిన్‌ యాప్‌లో జనవరి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.కోవిన్‌ యాప్‌ లో రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ లేకపోయినా అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్‌ తప్పనిసరి కాదనీ, దానికి బదులుగా స్టూడెంట్‌ ఐడీ కార్డుతో కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు డాక్టర్‌ శర్మ తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసిన తరువాత 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి టీకాలు ఇవ్వడం ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img