Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేడు జీఎస్టీ మండలి భేటీ

పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ తేవడంపై ప్రధానంగా చర్చ

న్యూదిల్లీ : జీఎస్టీ మండలి లక్నోలో శుక్రవారం భేటీ కానుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహిస్తారు. నాలుగు డజన్లకుపైగా వస్తువులపై ట్యాక్స్‌ రేటుపై సమీక్ష, 11 కోవిడ్‌ డ్రగ్స్‌పై పన్ను రాయితీలను డిసెంబరు 31 వరకు పొడిగించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. దేశమంతటా ఒకటే జీఎస్టీ కింద పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను, జొమాటో, స్విగ్గీ వంటి ఆహారం డెలివర్‌ చేసే యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించడం, వారు చేసే సరఫరాలపై జీఎస్టీ పన్నును ఐదు శాతం లెవీ చేసే విషయంలో మండలి చర్చించనుంది. ఉదయం 11 గంటలకు లక్నోలో జరగబోయే 45వ జీఎస్టీ మండలి భేటీకి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు, కేంద్రప్రభుత్వ సీనియర్‌ అధికారులు హాజరు కానున్నట్లు ఆర్థిక శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. కోవిడ్‌ కోసం ప్రస్తుతం వినియోగించే ఆంఫోటెరిసిన్‌ బి, టోసిలిజుమాక్‌, రెమ్‌డెసివిర్‌, హెపారిన్‌ వంటి మందులపై డిసెంబరు 31 వరకు రాయితీ పన్నురేటు వ్యవస్థను జీఎస్టీ మండలి ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఈ రాయితీ సెప్టెంబరు 30 వరకు ఉంది. ఆంఫోటెరిసిన్‌ బి, టోసిలిజుమాక్‌పై పన్ను రేటు లేదు, రెమ్‌డెసివిర్‌, హెపారిన్‌పై 2021 జూన్‌పై ఐదు శాతానికి తగ్గించబడిరది. ఈ క్రమంలో శుక్రవారం భేటీలో జీఎస్టీ పరిధిని 12శాతం నుంచి ఐదు శాతానికి ఏడు మందులపై తగ్గించే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. మరోవైపు జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలను రెస్టారెంట్ల పరిధిలోకి తీసుకువచ్చి వాటిపై జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉంది. జీఎస్టీలో నమోదైన హోటళ్లలో ఆర్డర్లపై ప్రస్తుతం రెస్టారెంట్‌ జీఎస్టీ విధిస్తున్నారు. చిన్న హోటళ్లు జీఎస్టీ పరిధిలో లేవు. ఫలితంగా ప్రభుత్వాలు ఏటా రూ.2వేల కోట్ల దాకా పన్ను రాబడిని నష్టపోతున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థను రెస్టారెంట్ల పరిధిలోకి రావాలనే దానిపైనా జీఎస్టీ మండలి చర్చించి నిర్ణయించనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img