Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేడు భారత్‌బంద్‌

రైతు, కార్మిక, రాజకీయ పార్టీల సమాయత్తం

సర్వం సన్నద్ధం
రాష్ట్ర ప్రభుత్వాల సంఫీుభావం

రామకృష్ణ పిలుపు


విశాలాంధ్ర`ఒంగోలు : సెప్టెంబరు 27న జరిగే భారత్‌ బంద్‌లో భాగస్వాములు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విద్యార్థి, యువజనులకు పిలుపు నిచ్చారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఐదు రోజులుగా జరి గిన ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. రామకృష్ణ శిక్షణ తరగతుల ముగింపు ప్రసంగం చేస్తూ దేశానికి అన్నం పెట్టె రైతు అనేక కష్టాలు, నష్టాలలో ఉన్నాడన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్లచట్టాల కారణంగా రైతు బతుకు బానిసల కన్నా హీనంగా మారే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇటువంటి పరిస్థితిలో అన్నదాతలకు విద్యార్థి, యువజనులు అండగా నిలవాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విద్యార్థి, యువజనుల పోరాటాలతో, బలిదానాలతో సాధించుకున్నామన్నారు. దానిని తిరిగి కాపాడుకునేందుకు మరో పోరాటానికి సన్నద్ధం కావాలన్నారు. కొత్తపట్నం1937 రాజకీయ శిక్షణ తరగతుల స్ఫూర్తితో శిక్షణ తరగతులలో పాల్గొన్న విద్యార్థి, యువజనులు జాతీయ, రాష్ట్ర నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలో అన్ని రంగాలను శాసిస్తున్నది రాజకీయ నాయకులేనని, అందుకే యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వే, ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, విద్యుత్‌ వంటి సంపదను అదాని, అంబానీలకు కట్టబెట్టటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకే సమయం కేటాయిస్తోందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఐదు రోజులు జరిగిన శిక్షణ తరగతులు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img